అదనపు కమిషనర్ జక్కుల సువార్త పదవీ విరమణ
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్(Karimnagar Additional Commissioner)గా సేవలందించి పదవీ విరమణ పొందిన జక్కుల సువార్త(Jakkula Suvarta) పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై.. జక్కుల సువార్త ను శాలువాతో సన్మానించి రిటైర్మెంట్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... సువార్త తన సుదీర్ఘ సేవా కాలంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి, నగర ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిల పనిచేసి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు.
తన వద్దకు వచ్చిన ప్రతి ప్రజా సమస్యను తనదైన శైలిలో, బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు ఆమె విశేష కృషి చేశారన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల్లోను, పరిపాలన వ్యవహారాల్లోనూ ఆమె అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్యం, ఇతర విభాగాల సమన్వయంలో కీలక పాత్ర పోషించి అధికారుల, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందారని తెలిపారు.