విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, షూస్ పంపిణీ
30-10-2026 | 08:36pm
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం(Chityala mandal) తాళ్లవెల్లంల గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాల(MPUPS School)లో శుక్రవారం విద్యార్థులకు పార్ట్-2 పాఠ్యపుస్తకాలు, రెండో జత పాఠశాల యూనిఫాంలు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఎలుకరాజు ఆంజనేయులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉపసర్పంచ్ సునీత బుచ్చిరాములు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న చంద్రశేఖర్, ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, లింగారెడ్డి, కాటమయ్య, మౌనిక, శివాని, సంధ్య తదితరులు పాల్గొన్నారు.