విద్యార్థులలో సామర్థ్యాలు పెంపొందించాలి
జిల్లా విద్యాధికారి రాము
జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి రిసోర్స్ పర్సన్ లకు జరిగిన శిక్షణ సమావేశంలో జిల్లా విద్యాధికారి రాము పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 2, 3 తేదీలలో మండల స్థాయిలో జరిగే పాఠశాల సముదాయ సమావేశాలను సజావుగా నిర్వహించాలని, ఉపాధ్యాయులకు మిడ్ లైన్ పరీక్షల యాప్ ను సాధన చేయించాలని, పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ పరీక్ష కొరకు ఉపాధ్యాయులచే భాషా, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల ప్రశ్నల నిధిని రూపొందించాలి.
మిడ్ లైన్ పరీక్షలో విద్యార్థుల ప్రగతిని పెంచేందుకు ఉపాధ్యాయులు తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు నిరంతరం తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్ ఎల్ ఎన్ సెల్ సభ్యులు సంధి శ్రీనివాస్ రెడ్డి, కడకుంట్ల అభయ్ రాజ్, గుండు విజయ్, దాసరి జయంత్, గన్నారపు ప్రవీణ్, మహేష్, ఉమేష్ పాల్గొన్నారు.