జాతీయ సాహస శిబిరానికి శాతవాహన విద్యార్థి

30-10-2026 | 08:38pm

ముకరంపుర,(విజయక్రాంతి): జాతీయ సేవా పథకం(National Service Scheme) ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నవంబర్ 18 నుండి 27 వరకు నిర్వహించనున్న జాతీయ సాహస శిక్షణ శిబిరానికి(National Adventure Training Camp)  శాతవాహన విశ్వవిద్యాలయ(Satavahana University) విద్యార్థి కాసరపు సంతోష్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయి శిబిరానికి సంతోష్ ఎంపిక కావడం పట్ల శాతవాహన ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య పి సతీష్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీశైలం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రగిరి అనిల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే ఇలాంటి సాహస శిబిరాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, పట్టుదలను పెంపొందిస్తాయని, సంతోష్ ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని సంతోష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు