ప్రజల రక్షణ, భద్రతె ముఖ్యం

16-10-2026 | 08:35pm

ముకరంపుర, అక్టోబర్ 16(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో(Election time) ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రధాన బాధ్యత అని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(Karimnagar Municipal Corporation) 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల - తంగెళ్ల కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. డివిజన్‌లో ప్రజల రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో  8 సీసీ కెమెరాలు(CC Cameras) శుక్రవారం రోజున కరీంనగర్ 3 టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ తో కలిసి కార్పొరేటర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ బొట్ల శ్యామల - తంగెళ్ల కిరణ్ కుమార్  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డివిజన్ ప్రజలకు భద్రతపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. 27వ డివిజన్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 3 టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసు వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. డివిజన్‌లో నేరాల నియంత్రణకు, అనుమానాస్పద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి మరియు ప్రజలకు మరింత రక్షణ కల్పించడానికి ఈ సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు