విద్యానగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
19-10-2026 | 10:34pm
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
తూప్రాన్, అక్టోబర్, 19 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా, ఆడపడుచుల ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) వేడుకలు తూప్రాన్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఘనంగా జరిగాయి. తెలంగాణ పూల పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ సంబరాలను మహిళలు సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.