రేగులగుంటలో విబిజి రామ్ పనుల ప్రారంభం
ములకలపల్లి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulakalapalli mandal) జగన్నాధపురం పంచాయతీ పరిధిలోని రేగులగుంట గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను సర్పంచ్ కుంజా వినోద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
గ్రామస్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పనుల్లో పాల్గొనాలని సూచించారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టేందుకు పంచాయతీ తరఫున కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.రేగులగుంట గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ భద్రం, టిఏ,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.