అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం

12-09-2026 | 10:14pm

కరీంనగర్,(విజయక్రాంతి): ఐ.సి.డి.ఎస్, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్కండేయ నగర్ అంగన్వాడీ కేంద్రం(Markandeya Nagar Anganwadi Center)లో శనివారం పోషణ మాసం కార్యక్రమం(Nutrition masam program) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి(District Welfare Officer Saraswati), కార్పొరేటర్ తెల్ల లక్ష్మీ రమేష్, సిడిపిఓ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, కుటుంబ సభ్యులు వారు మంచి ఆహారం తీసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా తల్లి బిడ్డలు పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

మహిళల్లో ఐరన్ లోపం అధికమించేందుకు మునగ, బచ్చలి, ఆకుకూరలు, పల్లీలు బెల్లం వంటివి తీసుకోవాలని తెలిపారు. సీజన్లో లభించే పండ్లు, తాజా కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని అన్నారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వారి బరువు, ఎత్తు పరీక్షించుకోవాలని తెలిపారు. బరువు తక్కువగా ఉండే పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక బాలామృతం పంపిణీ చేస్తారని తెలిపారు. నెలలు నిండిన గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిడిపిఓ కవిత వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువగా మేలు జరిగే ఆహారాలను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా తల్లులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అంగన్వాడి టీచర్ శ్రీలత, రమణ, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు