బీఆర్‌ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం
- అందుకే -ఒకరినొకరు విమర్శించుకోరు
- సిరిసిల్ల బహిరంగ సభ అనగానే బీఆర్‌ఎస్ నేతల ఉలికిపాటు
- ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పటినుండి ఒక లెక్క.. కాస్కో కేటీఆర్
- సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముకరంపుర, సెప్టెంబర్ 27 (విజయక్రా ంతి): ఈ నెల 30 న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కరీంనగర్,సిరిసిల్ల పర్యటన కార్యకర్తల్లో ప్రజల్లో జోష్ నింపడం ఖాయం అని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former Chairman Komatireddy Narender Reddy) అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రూ: 60 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
సుడా నిధులు కోటి రూపాయలతో కలెక్టరేట్ ఉత్తరం వైపునుండి ప్రధాన రహదారి నిర్మాణం చేశామని హెలిప్యాడ్ నిర్మాణానికి 65 లక్షలు గార్డెన్లకు సింథెటిక్ ట్రాక్ నిర్మాణానికి కోటి రూపాయలు పాత బిల్డింగ్ ఫేస్ లిఫ్ట్ కు 30 లక్షలు అన్నీ కలిపి 3 కోట్ల సుడా నిధులు వెచ్చించామని నరేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీ నాయకులకు డ్రామాలు,దాడులు నిత్యకృత్యమయ్యాయని మొన్న నీటి విడుదలపై డ్రామా చేశారని నిన్న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో దాడికి పాల్పడ్డారని దాడుల సంస్కృతి మంచిది కాదని ఓపిక పడుతున్నామని ఇక చూస్తూ ఊరుకోబోమని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
కేబుల్ బ్రిడ్జ్ పై లైట్లు వెలుగక పోవడానికి కారణం ఆనాడు లోపభూయిష్టంగా చేసిన టెండర్ ప్రక్రియ వల్లనే అని ఆర్వోబి నిర్మాణం ఆలస్యానికి కారణం 3 సంవత్సరాల తర్వాత మెయిన్ పియర్స్ డిజైన్స్ ఇవ్వడం వల్లనే అని బీజేపీ బీఆర్‌ఎస్ ల మధ్య ఉన్న చీకటి ఒప్పందం వల్ల ఈ రెండు పార్టీలు ఏనాడు విమర్శించుకోవని నరేందర్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతల భూభాగోతాన్ని బట్టబయలు చేసిన నేపథ్యంలో సీఎం పర్యటన అనగానే బీఆర్‌ఎస్ నాయకులు ఉలిక్కిపడుతున్నారని ఇన్నిరోజులు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అని కేటిఆర్ ఇక కాస్కో అని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పోరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, జగన్ రెడ్డి,నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి,షబానా మహమ్మద్, ఆస్తపురం తిరుమల, జ్యోతి రెడ్డి,భారీ,కీర్తి కుమార్, అంజయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.