నేలవాలిన వరి.. మొలకెత్తిన కన్నీరు!
పంట నష్టాన్ని పరిశీలించిన ఏఈఓ వెంకటేష్
కల్లూరు,(విజయక్రాంతి): అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణంతో కల్లూరు మండలంలోని( Kalluru Mandal) వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో గురువారం చిన్న కోరుకొండి, వెన్నవల్లి, తెలగవరం, తాళ్లూరు గ్రామాల్లో ఏఈఓ వెంకటేష్ పర్యటించి నేలవాలిన వరి పంటలను పరిశీలించి నష్ట వివరాలను నమోదు చేశారు. వెన్నవల్లికి చెందిన రైతు కావేటి రాధాకృష్ణమూర్తి సాగు చేసిన వరి పంట పూర్తిగా నేలవాలడంతో పాటు కంకులు మొలకెత్తాయి. దీంతో పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పంట నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించి, బాధిత రైతులకు ఎకరాకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.