అఖిల భారత రైతు సంఘం

13-11-2026 | 12:33am

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి 

ఎల్బీనగర్: అఖిల భారత రైతు సంఘం(All India Farmers Union) జాతీయ  36వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చార.  నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే  అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో  కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహకార కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పొట్టేపాకు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలన్నారు.  నవంబర్ 15న పదిహేను లక్షల మందితో  భారీ బహిరంగ సభను  నిర్వహిస్తున్నట్లు, ఈ మహాసభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మున్నా, లాట్ల లక్ష్మణ్, జోసెఫ్, లింగయ్య, బాలరాజు, కృష్ణయ్య, యాదగిరి, ఆలేటి లచ్చయ్య, అంజయ్య, చిట్టెమ్మ, ఉప్పలమ్మ, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు