జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌గా చంద్రశేఖర్‌రెడ్డి నియామకం

13-11-2026 | 08:37am

జడ్చర్ల: జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌గా చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం వనపర్తి సబ్‌రిజిస్ట్రార్‌గా(Wanaparthy Sub-Registrar) విధులు నిర్వహిస్తున్న ఆయనను జడ్చర్లకు బదిలీ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జడ్చర్లలో పనిచేస్తున్న సమయ్యను వనపర్తికి బదిలీ చేశారు. ఈ మేరకు త్వరలో చంద్రశేఖర్‌రెడ్డి జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు