ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలి

13-11-2026 | 12:34am

- హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

- మూత్రశాలల నిర్మాణంతో ప్రజలకు ఇబ్బందులు రావొద్దు 

ఎల్బీనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) డిమాండ్ చేశారు. గురువారం హయత్ నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Hayathnagar ZP High School)లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మూత్రశాలల నిర్మాణాన్ని పాఠశాల ప్రహరీ నుంచి ఐదు అడుగుల లోపలికి జరిపి దుర్వాసన బయటకు వ్యాపించకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు.

నెలనెల ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న డైనింగ్ హాల్‌ను పరిశీలించారు.  డైనింగ్ హాల్‌లో ఫ్లోరింగ్ పనులను దాతల సాయంతో మరమ్మతులు చేయించి, ప్రస్తుతం ఉన్న వంటశాలను డైనింగ్ హాల్‌లోకి మార్చి వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, నాయకులు భాస్కర్ సాగర్, దీపావళి శ్రవణ్, నక్క దర్శన్, రాకేశ్, సందీప్, మధు, రమేశ్ ముదిరాజ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు