నాగులచవితికి కిక్కిరిసిన చిన్న తిరుపతి
13-11-2026 | 07:52am
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, జీళ్ళచెరువు గ్రామంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శుక్రవారం నాగులచవితి వేడుకలను భక్తులు వైభవంగా జరుపుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచీ వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. ఆలయం ఆవరణంలో ఉన్న పెద్ద పుట్ట వద్ద మహిళలు, యువతలు, భక్తులు పూజలు చేశారు. నాగమ్మ కు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని చల్లగా చూడాలనీ వేడుకున్నారు. ఆలయం ఈవో జగన్ మోహన్ రావు, జూనియర్ అసిస్టెంట్ మురళీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.