మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

13-11-2026 | 08:40am

మహిళా సంఘాల సమావేశాలు, కార్యక్రమాలకు భవనం ఎంతో ఉపయోగకరం: సర్పంచ్ గోదల సాయిరెడ్డి

జడ్చర్ల, నవంబర్ 13: జడ్చర్ల మండలంలోని కోడుగల్ గ్రామంలో మహిళల సౌకర్యార్థం నిర్మించనున్న మహిళా భవనానికి గ్రామ సర్పంచ్ గోదల సాయిరెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల అభివృద్ధి, గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం,వార్డు సభ్యులు అంజమ్మ, రామస్వామి, మున్నూరు నర్సింలు, బచ్చమ్మ, లక్ష్మయ్య, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు శాంతాబాయి, గౌతమి,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు