పారదర్శకంగా కల్లూరు 2బి బార్ కేటాయింపు...
- జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
- ఒక బార్ కేటాయింపు కోసం మొత్తం 325 దరఖాస్తులు
- వీడియో రికార్డింగ్ మధ్య పారదర్శకంగా డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహణ
- లాటరీలో చుంచుపల్లికి చెందిన చావా తరుణ్కు బార్ కేటాయింపు
- కలెక్టరేట్లో లాటరీ ద్వారా బార్ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం, అక్టోబర్- 16(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ(Kallur Municipality) పరిధిలోని ఒక 2బి బార్ కేటాయింపు ప్రక్రియను(2B Bar Allocation Process) లాటరీ విధానంలో పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బార్ కేటాయింపు కోసం డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించారు.
జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒక 2బి బార్ కేటాయింపు కోసం మొత్తం 325 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియలో భాగంగా ప్రతి దరఖాస్తుదారుకు కేటాయించిన టోకెన్ నంబర్ను నాణెంపై ప్రదర్శించి, ఆ నాణేలను ఒక స్టీల్ బాక్స్ లో ఉంచారు. అనంతరం బాక్స్ లో నుంచి ఒక నాణేన్ని తీసి విజేతను ఎంపిక చేశారు.
లాటరీ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించామని ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రతి దశను వీడియో రికార్డింగ్ చేసినట్లు తెలిపారు. ఈ లాటరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన చావా తరుణ్ (తండ్రి: శ్రీనివాస్ రావు)కు డ్రా వచ్చిందని ఈ విధంగా లాటరీ ద్వారా బార్ కేటాయింపు ప్రక్రియను నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. జానయ్య, ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.