ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలి

16-10-2026 | 03:37pm

బోథ్. అక్టోబర్ 16 (విజయ క్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) అర్హులైన ప్రతి పేదవారికి అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన బోథ్ సోనాల మండలాల లబ్ధిదారులకు అందించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు పెండ్లి భారం కావద్దన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

ఆడబిడ్డల తండ్రులకు భరోసా కల్పించి ఇచ్చారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ సర్పంచ్ ల మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచులు రాజు రెడ్డి, ధూప్ చంద్, సంజయ్ బాబూలాల్ అంబాజీ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, విడిసి అధ్యక్షులు పోతన్న, యూత్ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు రాకేష్ రెడ్డి ,సంజీవ్ ,రఫీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు