గ్రామ కార్యదర్శిపై సర్పంచ్ ఫిర్యాదు
నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నాగేష్ విధుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని గ్రామ సర్పంచి వనజ(Sarpanch Vanaja) ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 23 నుంచి ఇప్పటివరకు గ్రామ పంచాయతీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు లేవని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామ కార్యదర్శి విధులకు డుమ్మా కొట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఉన్నారు