6 September, 2026 | 12:29 PM

వెయ్యి రోజుల పాలనలో 300 కోట్ల అభివృద్ధికి శ్రీకారం

06-09-2026 | 11:09am

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే  హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు.

వైరా నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు.

మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు,

కారేపల్లి, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్‌ఎస్ పార్టీకి(BRS Party) లేదని కారేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు అన్నారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడంతోపాటు వెయ్యి రోజుల పాలనలో 300 కోట్లతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్‌ నందు శనివారం తోటకూరి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాతు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

వైరా నియోజకవర్గ అభివృద్ధికి(Wyra Development) సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులుతీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాందాస్ నాయక్‌కు దక్కుతుందని  అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడంతో పాటు వారికి బోనస్‌లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, పేదలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుండగా, రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తోటకూరి రాంబాబు తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిని గుర్తించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బానోత్ రామ్మూర్తి నాయక్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్,మాజీ సొసైటీ డైరెక్టర్ అడ్డగోడా ఐలయ్య,సర్పంచ్ లు మేధరి టోనీ, బానోత్ హిరాలాల్,దండు ప్రవీణ్, ఈసం మూతి వీరస్వామి, మీడియా కోఆర్డినేటర్ వాంకుడోత్ గాంధీ,కాంగ్రెస్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి,తాజుద్దీన్,కడియాల సుధాకర్,హనీఫ్, అదెర్ల రాములు, గుగులోత్ బాబు, ఈసాల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు