ఎమ్మెల్సీగా సర్వోత్తమరెడ్డి గెలుపు తథ్యం
- ఎల్ నోవా ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు రానీవ్వం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తాగునీటి విషయంలో చర్యలు చేపట్టాం
- వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్
వైరా, ఖమ్మం, అక్టోబర్ 25 (విజయక్రాం తి): ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్(MLA Maloth Ramdas Naik ) జోస్యం చెప్పారు. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎల్నినో వాతావరణ పరిస్థితులు వ్యవసాయంపై వాటి ప్రభావం, ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు,
చలో ఢిల్లీ కార్యక్రమాలపై అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో పాటు టీపీసీసీ కోఆర్డినేటర్లు, ఖమ్మం కన్వీనర్లు దుద్దిళ్ల శ్రీనుబాబు, వేగి వెంకటేష్ గారితో పాటు ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్నినో వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షపాతం,
ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ పంటల సాగు, నీటి వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, తాగునీటి వనరులను కాపాడుకోవాలని, విద్యుత్ పరికరాలు,
బహిరంగ విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తడిచేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదని, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన ఓటర్లు తమ వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. అదేవిధంగా అర్హులైన పట్టభద్రులు,
ఉపాధ్యా యులు సంబంధిత నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.