రబీ పంటలను సాగు చేయవద్దు..
* నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న భూగర్భ జలాలు లేవు...
* విద్యుత్ శాఖ ఎస్ ఈ జాదవ్ సుభాష్..
ఉట్నూర్, అక్టోబర్ 18( విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం(El Nino Impacts)తో వర్షాకాలంలో సరియైన వర్షాలు కురవలేదని, దీంతో భూగర్భజలాలు పెరగలేదని, వచ్చే రబీ సీజన్లో సాగునీరు సరిపోదని రబీ పంటలను సాగు చేయవద్దని విద్యుత్ శాఖ ఎస్ఈ జాదవ్ సుభాష్ అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండలంలోని హార్కాపూర్ గ్రామంలో రైతు బాట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి విద్యుత్ సరఫరాపై వారి అభిప్రాయాలను సేకరించారు.
ప్రస్తుతం విద్యుత్ సరఫరా సక్రమంగా జరుగుతుందని రైతులు ఎస్ఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. ప్రజలకు రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. విద్యుత్ శాఖ సేవలను ప్రతి ఒక్కరూ సద్విని చేసుకోవాలని సూచనలు చేశారు. విద్యుత్ శాఖ నుండి దొంగతనంగా కరెంటు తీసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు.
రబీ సీజన్ ప్రారంభమైనందున రైతులు రబీ పంటలను సాగు చేయడం వైపు దృష్టి సారించవద్దని ఈ సందర్భంగా వివరించారు. రబీ పంటల సాగుకు విద్యుత్ సరఫరా ఉంటుందని, కానీ భూగర్భ జలాలు అంతంత మాత్రంగా ఉన్నాయని గుర్తు చేశారు. వేసవిలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపును పాటించాలని, నీటి పొదుపు కోసం వ్యవసాయ చేనులలో ఫారం ఫండ్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. ఆయనతో పాటు ఏఈ ఈ జాదవ్ రోహిదాస్, విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.