విద్యుత్ సబ్స్టేషన్లను పరిశీలించిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
ఖమ్మం, అక్టోబర్ 16(విజయక్రాంతి):విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, ముందస్తు ప్రణాళికతో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి(TG NPDCL CMD Karnati Varun Reddy) పేర్కొన్నారు శుక్రవారం ఖమ్మం జిల్లా పరిధిలోని పలు విద్యుత్ సబ్స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖమ్మం సర్కిల్ పరిధిలోని 132/33 కేవీ అరెంపుల, కూసుమంచి, 132 కేవీ అన్నారుగూడెం, 33 కేవీ ఏన్కూర్ సబ్స్టేషన్లను సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, నిర్వహణ చర్యలు, విద్యుత్ సరఫరా స్థితిగతులను పరిశీలించారు. వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే సీజన్లో . నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా రైతులు, వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఒక వేళా క్షేత్రస్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయినా వెంటనే ట్రాన్స్ఫార్మర్లను త్వరితగతిన మార్చాలని, రైతులకు అదనపు మోటార్ల వినియోగం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ను పొదుపుగా వినియోగించుకునేలా వినియోగదారులకు సూచనలు చేయాలని తెలిపారు.. సీఎండీ వెంట ఎస్ ఈ శ్రీనివాసచారి , డి.ఈ ఖమ్మం రూరల్ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు .