శాంతినగర్‌లో మహిళలకు 40 చీరల పంపిణీ

18-10-2026 | 07:31pm

కల్లూరు,అక్టోబర్ 18 (విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ(Kalluru Municipality) పరిధిలోని శాంతినగర్ కాలనీలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మహిళలకు రూ.20 వేల విలువైన 40 చీరలను మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకుడు కాటేపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్‌పర్సన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి, సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు పాపబత్తిని నగేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆళ్లకుంట నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, పెద్దబోయిన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు ఖమ్మంపాటి రాధా వీరస్వామి, గుండ్ల పుల్లారావు, జిల్లెళ్ల స్వాతి భాస్కర్ రెడ్డి, షేక్ తురాబ్ అలీ, బైర్ల కాంతారావు, మట్టా రామకృష్ణ, తోట సుబ్బారావు, రాజబోయిన శ్రీను, కాలనీ మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు