భోజనశాల పునర్నిర్మాణానికి కృషి చేస్తాం
18-10-2026 | 08:37pm
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్ అక్టోబర్ 18 (విజయ క్రాంతి) : బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయాన్ని(Sri Chakreshwara Shiva Temple) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న భోజనశాలను పరిశీలించి, దాని పునర్నిర్మాణానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ఆలయ ఖాళీ స్థలానికి కంచె ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.