ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
హనుమకొండ, అక్టోబర్ 18 (విజయక్రాంతి): హనుమకొండ నగరంలోని(Hanamkonda City) గోపాల్పూర్ ఉషోదయ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు(Saddula Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించినారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జముల లాయచందమామ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తు బొమ్మ వాకిట్లో పెట్టి గంగమ్మ అని అడిగింది గౌరమ్మని అడిగింది చల్లంగా చూడని తెలంగాణ సంస్కృతిలో(Telangana Culture) మహిళలు బతుకమ్మను పవిత్రంగా 9రోజులాడి చివరి రోజు అయిన ఈరోజు చిన్న,పెద్ద తేడా లేకుండా బతుకమ్మను ఘనంగా పాటలతో ప్రారంభించి నృత్యాలు చేశారు.
ప్రకృతిని పూజించి ప్రకటించి పువ్వులను సేకరించి ప్రకృతి లోనే కలిపి ఏకైక సంస్కృతి తెలంగాణ ఆడపడుచుల అందమైన ఉయ్యాల పాటలతో ఉషోదయ కాలనీ కోలాహాలంగా మారింది. ఉషోదయ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కోలాటాల తో ప్రకృతి పువ్వుల పై పాటలు రూపకంగా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో అందరిని మంత్రముగ్ధులను చేశారు.చిన్న పిల్లలు కోలాహటాలతో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొని చివరి రోజు ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు,మహిళలు,చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.