కామారెడ్డిలో బతుకమ్మ నిమజ్జనం కోసం పాట్లు
విద్యుత్ లైట్లు అమర్చని మున్సిపల్ అధికారులు
ఇబ్బందులు పడిన మహిళలు
కామారెడ్డి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ బతుకమ్మ పండుగ(Telangana Bathukamma Festival) కామారెడ్డిలో బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లలో మున్సిపల్ అధికారులు(Municipal officials) నిర్లక్ష్యం వహించారు. కామారెడ్డి పెద్ద చెరువు వద్ద లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో నిమజ్జనం కోసం వచ్చిన మహిళలు ఆదివారం రాత్రి పడరాని పాట్లు పడ్డారు. మున్సిపల్ అధికారులకు పెద్ద చెరువు వద్ద మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక కౌన్సిలర్ నరేందర్ రెడ్డి(Councillor Narender Reddy) కోరిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారు.
పెద్ద చెరువు వద్ద లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో నిమజ్జనం కోసం వచ్చిన మహిళలు బతుకమ్మల నిమజ్జనం చేయడం, ప్రసాదం పంచుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ లైట్లు ఆమర్చడంలో మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం వల్ల నిర్లక్ష్యం వహించారని బిజెపి కౌన్సిలర్ నరేందర్ రెడ్డి ఆరోపించారు. మహిళలు ఇబ్బంది పడకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు ముందు రోజే వినతి పత్రాన్ని అందజేసిన పట్టించుకోలేదని ఆయన అన్నారు.
బతుకమ్మ నిమజ్జనం కోసం పెద్ద చెరువు వద్దకు వచ్చిన మహిళలు టార్చిలైట్లు పెట్టుకొని ఇబ్బందులతో నిమజ్జనం చేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ బతుకమ్మ పండుగ పట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నించారు. మహిళలు మున్సిపల్ అధికారుల తీరుపై శాపనార్థాలు పెడుతూ మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు.