నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి
సింగరేణి, నవంబర్ 25 (విజయక్రాంతి): సింగరేణి మండలం బల్లు నగర్ గ్రామానికి చెందిన బెల్ కంపెనీ డీజీఎం గుగులోతు రవి కుటుంబ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ హాజరై నూతన వధూవరులు సావిత్రి అనిల్ కుమార్ లను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలకు వివాహ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వధూవరులు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.ఈ వివాహ వేడుకలో మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్, విజయ బాయి, ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.