తిమ్మాపూర్ గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

25-11-2026 | 06:16pm

నిర్మల్ జిల్లా: భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో విబిజీ రాంజీ పథకం (Scheme) కింద రూ.30 లక్షల నిధులతో చేపట్టనున్న గోదాం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ చేశారు. రైతుల పంట నిల్వల (Storage) సౌకర్యం కోసం గ్రామగ్రామాన కేంద్ర ప్రభుత్వ (Central Government) నిధులతో గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు (Funds) కేటాయిస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంజీవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మాజీ ఎంపీపీ రజాక్, బీజేపీ మండల అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, సర్పంచ్‌లు శ్యాంరావు పటేల్, వినోద్, మాజీ సర్పంచ్‌లు రమేష్, మాజీ ఎంపీటీసీ అశోక్, సీనియర్ నాయకులు ధర్మగౌడ్, స్థానిక నాయకులు దేవన్న, దుబాయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు