మేడారంలో భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

25-11-2026 | 06:23pm

ములుగు, నవంబర్ 25 (విజయక్రాంతి): శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అభివృద్ధి పనుల కోసం దేవాదాయ శాఖకు కేటాయించిన భూములను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు(District Collector Bhorkhade Hemant Sahadeorao) పరిశీలించారు. బుధవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాలతో కలిసి మేడారంలో దేవాదాయ శాఖకు కేటాయించిన 28 ఎకరాల భూమిని, శాశ్వత ప్రాతిపదికన బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాల వెనుక వైపున దేవాదాయ శాఖకు కేటాయించిన 28 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూముల ప్రస్తుత పరిస్థితి, ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలతో పాటు భవిష్యత్తులో అతిథి గృహం, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు స్థలం అనుకూలతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో కుమారస్వామి, తహసీల్దార్ సురేష్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు