ధాన్యం.. రైతు దైన్యం!
- తేమ పేరుతో తకరారు..?
- గణనీయంగా తగ్గిన ధాన్యం ధర
- మార్కెట్లో రైతుల పడిగాపులు
కేసముద్రం, నవంబర్ 12 (విజయక్రాంతి): వరి పంట కోతలు ముమ్మరమైన నేపథ్యంలో వ్యాపారులు ధాన్యం ధరలు(Paddy Prices) రోజుకు కొంత చొప్పున తగ్గిస్తూ తమను నిలువు దోపిడీ చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తేమ సాకు చూపెట్టి ఇష్టానుసా రంగా ధర పెడుతూ తమను అందిన కాడికి దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వం క్వింటాలకు 2,461 రూపాయలు మద్దతు ధర ఇవ్వడంతో పాటు అదనంగా 500 రూ పాయల బోనస్ ఇస్తుందని ప్రకటించడంతో ఈ వానాకాలం సీజన్లో రైతులు ఎక్కువగా సన్నధాన్యం సాగు చేశారు. అయితే తీరా పంట కోతలు ప్రారంభ సమయంలో 3 వేలకు పైగా ధర పెట్టిన వ్యాపారులు ఇప్పు డు గరిష్టంగా క్వింటాలకు 2,200 నుండి 2,600 వరకే ధర పెడుతున్నారని, ఇంత ధర తగ్గించడం ఏమిటని ప్రశ్నిస్తే తేమ అధికంగా ఉందని సాకుగా చూపుతూ, ఇష్టముం టే అమ్మండి.. లేదంటే కొనుగోళ్లకు తిరస్కరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం ధాన్యాన్ని విక్రయానికి తేగా ధాన్యం ధర అమాంతం తగ్గించడంతో చాలా మంది రై తులు తమ ధాన్యాన్ని అగ్గువ ధరకు విక్రయించకుండా మార్కెట్లోనే ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. దీనితో ధాన్యం విక్రయానికి మార్కెట్లో రోజుల తరబడి పడి గాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ధాన్యం వ్యాపారులు ఏకమై ఉన్నఫలంగా ధర తగ్గించి తమకు అన్యా యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో, మిల్లుల వద్ద మొదట్లో ఎక్కువ ధర పెట్టడం వల్ల ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సం దిగ్ధం వ్యక్తం చేస్తుండడంతో, ఇప్పుడు వ్యా పారులు ఇలా ధాన్యానికి అమాంతం ధర తగ్గించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
ప్రభుత్వం వెంటనే గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్, మిల్లుల వద్ద వ్యాపారులు ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తుండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న ధాన్యం కొనుగోలు కోసం వెం టనే కార్యాచరణ చేపట్టి ధాన్యానికి మద్దతు ధర ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
కళ్ళం నుండి నేరుగా మార్కెట్ కు..!
రైతులు వరి పంటను యంత్రాలతో కోతలు పెడుతూ నేరుగా ధాన్యాన్ని మార్కెట్ కు తెస్తున్నారు. కళ్ళంలో బాగా శుభ్రం చేసి ఆరబెట్టి తీసుకురాకుండా, మార్కెట్కు తీసుకువచ్చి ఓపెన్ యార్డు, షెడ్లల్లో ఆరబోసుకుంటున్నారు. దీనితో ఇతర రైతులకు, కొనుగోళ్లకు ఆటంకంగా మారి వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షెడ్లు, ఓపెన్ యార్డు ధాన్యం ఆరబోయడంతో చాలామంది రైతులకు ధాన్యం విక్రయించడానికి స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పొలం వద్ద ధాన్యాన్ని బాగా ఆరబెట్టి శుభ్రం చేసి మార్కెట్కు తేవాలని మార్కెట్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ కోరుతున్నారు.