ప్రపంచవ్యాప్తంగా టెన్షన్
Microsoft 365లో సాంకేతిక సమస్య.. యూజర్లు విలవిల!
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజం Microsoft కు చెందిన సేవల్లో ఒక్కసారిగా భారీ అంతరాయం ఏర్పడింది. Outlook, Microsoft Teams, Copilot సహా పలు Digital Platforms సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడం, Inbox ఓపెన్ చేయడంలో సమస్యలు తలెత్తడంతో ఉద్యోగులు, వ్యాపార సంస్థలు ఆందోళనకు గురయ్యాయి.
గురువారం మధ్యాహ్నం అమెరికా కాలమానం ప్రకారం 1 గంట దాటిన తర్వాత Outlook సమస్యలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. Outage Tracking Platform Downdetector లో ఒక దశలో దాదాపు 1.30 లక్షల మంది యూజర్లు సమస్యలను Report చేశారు. చాలామందికి ఈమెయిల్ అకౌంట్లు ఓపెన్ కాకపోగా, మరికొందరికి Messages Send, Receive చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. Inbox Loading కాకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది.
Outlook మాత్రమే కాకుండా Microsoft Teams, AI Assistant Copilot, Microsoft 365 Services పైనా ఈ అంతరాయం ప్రభావం చూపింది. దీంతో రోజువారీ Office Work, Online Meetings, Business Communication నిర్వహించే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా Microsoft సేవలపై ఆధారపడే సంస్థల్లో పనులు మందగించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంపై Microsoft స్పందిస్తూ.. అమెరికా ప్రాంతాల్లోని వినియోగదారులు Exchange Online Mailboxes ను వివిధ మార్గాల్లో Access చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని వెల్లడించింది. సమస్యను పరిష్కరించేందుకు Technical Teams రంగంలోకి దిగినట్లు తెలిపింది.
కంపెనీ ప్రాథమిక పరిశీలనలో తమ Infrastructure లోని కొంత భాగంపై సాధారణం కంటే ఎక్కువ Load పడుతున్నట్లు గుర్తించింది. దీనివల్ల Connectivity Errors ఏర్పడుతున్నాయని వివరించింది. అంతేకాకుండా Automated Checks సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కొన్ని Servers అనూహ్యంగా అందుబాటులో లేకుండా పోయాయని వెల్లడించింది. ఈ సమస్యకు కారణమైన లోపాన్ని గుర్తించి Fix ను పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు Microsoft Teams కు సంబంధించి ఉత్తర అమెరికాలో తలెత్తిన సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లు సంస్థ గతంలో ప్రకటించింది. అయినప్పటికీ కొంతమంది యూజర్లు ఇంకా Connectivity Issues ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. సమస్య పూర్తిగా ఎప్పుడు పరిష్కారమవుతుందనే దానిపై కంపెనీ స్పష్టమైన సమయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం సేవలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు Microsoft చర్యలు కొనసాగిస్తోంది.