నీరు, విద్యుత్ ని పొదుపుగా వాడాలి

13-11-2026 | 12:26am

- మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి 

- ఎల్బీనగర్ నుంచి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ వరకు మారథాన్ రన్ 

ఎల్బీనగర్: ప్రజలందరూ నీరు, విద్యుత్ ని పొదుపుగా వాడుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో గురువారం SWEAT RUN (Save Water Electricity Act Today)  మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం(తార్నాక) వరకు సుమారు పది కిలోమీటర్ల మారథాన్ రన్ నిర్వహించారు. నీటి, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు. 

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే నీటి కొరత, విద్యుత్ వినియోగంపై ముందస్తు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామినేని హాస్పిటల్స్ నుంచి నిర్వహించిన పరుగులో నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్ల వద్ద కూడా ప్రజలు పాల్గొన్నారు. రన్నర్లు, వాకర్లు ఉత్సాహంగా పాల్గొని నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు ఆవశ్యకతపై ప్రజలకు సందేశాన్ని అందించారు. కార్యక్రమ ముగింపు వేడుకల్లో  కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... నీటి ప్రతి చుక్క విలువైనదని, విద్యుత్ ప్రతి యూనిట్‌ను బాధ్యతాయుతంగా వినియోగించాలన్నారు. 

మరిన్ని వార్తలు