సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎస్కే ఖాదర్ బాబా
18-10-2026 | 04:37pm
ప్రధాన కార్యదర్శిగా బి. రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక.
సత్తుపల్లి. అక్టోబర్ 18. ( విజయక్రాంతి ) : సత్తుపల్లి ప్రెస్ క్లబ్(Sattupalli Press Club) (TUWJ–IJU అనుబంధం) 2026 నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎస్కే ఖాదర్ బాబా(SK Khader Baba) ని, ప్రధాన కార్యదర్శిగా బి. రామకృష్ణ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, పాత్రికేయుల సంక్షేమం(Welfare of Journalists) కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు పలువురు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలియజేశారు.