అమ్మవారికి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ

18-10-2026 | 04:41pm

కూసుమంచి, అక్టోబర్ 18 విజయక్రాంతి): కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజి మహరాజ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారి మండపం వద్ద మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి(Kandala Upender Reddy) దుర్గాదేవి విగ్రహాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న కందాళ ఉపేందర్ రెడ్డికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం రాజుపేట గ్రామంలో రామాలయం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గం ప్రజలందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ప్రజలందరికి సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు