లేబర్ మంత్రిపై విచారణ జరపాలి

25-10-2026 | 04:27pm

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

ఆసిఫాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో(TGSRTC Recognized Union Election) అక్రమాలు జరిగాయని ఏఐటీయూసీ(AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆరోపించారు. TWU కూటమికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేసి, రాష్ట్రస్థాయిలో మెజారిటీ సాధించిన టీజీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(TGSRTC Employees' Union) (ఏఐటీయూసీ)కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆదివారం ఆసిఫాబాద్‌లో(Asifabad) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాలుగు రీజియన్లలో మూడు రీజియన్ల గుర్తింపును ప్రభుత్వ అనుకూల TWU కూటమికి కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ జోక్యం ఉందని ఆరోపించారు. కార్మికుల హక్కులను(Workers rights) కాపాడాల్సిన లేబర్ మంత్రి, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గుర్తింపు వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఈ నెల 28న లేబర్ కమిషనర్ కార్యాలయం(Office of the Labour Commissioner) వద్ద వేలాది మంది కార్మికులతో మహాధర్నా, ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆసిఫాబాద్ డిపో అధ్యక్షుడు సీహెచ్. మల్లికార్జున్, కార్యదర్శి ఎల్పుల అశోక్, సహాయ కార్యదర్శి నరేష్, కోశాధికారి జీఎం బాబు, నాయకుడు రాజేందర్ సింగ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు