రికార్డులు చేతికి.. ధర్నా వాయిదా!

01-10-2026 | 02:30pm

బెజ్జూర్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ రికార్డులను నాలుగు నెలల క్రితం తనిఖీ పేరుతో అడిషనల్ కలెక్టర్ తీసుకెళ్లారని, దీంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందని సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లి, రికార్డులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నానంటూ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు.విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సర్పంచ్‌కు మద్దతుగా నిలిచారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. దీంతో స్పందించిన అధికారులు బుధవారం రాత్రే రికార్డులను పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. దీంతో సమస్య (PROBLEM) పరిష్కారం కావడంతో సర్పంచ్ ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి దీవెనలు ఎల్లవేళలా తనపై ఉండాలని ఆమె అన్నారు. తన వినతిని మన్నించిన అధికారులకు, అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప, బీఆర్ఎస్ నాయకులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ (GRAM PANCHAYAT) రికార్డులు తిరిగి అందడంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.అధికారులు స్పందించి రికార్డులను (RECORDS) అప్పగించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు (THANKS) తెలిపారు.

మరిన్ని వార్తలు