12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు
26-10-2026 | 10:32pm
ప్రజావాణిలో అర్జీ
బెజ్జూర్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణపెళ్లి గ్రామం నుంచి గూడెం వరకు తారు రోడ్డు అధ్వానంగా మారింది. దీనితో 12 ఆదివాసీ గ్రామాల ప్రజలు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బెజ్జూర్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల విభాగం నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్(Nodal Officer Praveen Kumar)కు అర్జీ అందించారు. తారురోడ్డుతో పాటు భీంపూర్, సుస్పిర్ గ్రామాల వద్ద వంతెనలు నిర్మించాలని కోరారు.