ఎం జె పి గురుకులంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

26-11-2026 | 05:23pm

ఆసిఫాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో(Mahatma Jyotibapule Girls' Gurukul School) గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన విధానాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబాయి విద్యార్థినులకు వివరించారు. ప్రార్థన సమయంలో విద్యార్థినులు రాజ్యాంగ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు