కొండచిలువ హతం..

26-11-2026 | 05:56pm

నిర్మల్ నవంబర్ 26 ( విజయ క్రాంతి): నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో(Talveda Village) భారీ కొండచిలువ హతం అయ్యింది.  గురువారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన రైతు సాయేందర్ తన వ్యవసాయ పొలంలో వరి కోతలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రైతు అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు పొలం వద్దకు చేరుకున్నారు.

సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి ఆందోళనకు గురైన కొందరు గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో అది మృతి చెందింది. పంట పొలంలో భారీ కొండచిలువ కనిపించడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని వార్తలు