ములుగు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

26-11-2026 | 05:44pm

వెంకటాపూర్, నవంబర్ 26 (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(BRS Working President KTR) మంత్రి సీతక్క చేస్తున్న విమర్శలను జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్క రమేష్ తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను విమర్శించే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని, పింఛన్ల పెంపు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం,

రైతులకు పెట్టుబడి సాయం వంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క ములుగు జిల్లాకు చేసిన శాశ్వత అభివృద్ధి ఏమిటో వివరించాలని కోరారు. గ్రామీణ రహదారులు, తాగునీరు, సాగునీటి సదుపాయాల కల్పనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మల్క రమేష్ హితవు పలికారు.

మరిన్ని వార్తలు