హాస్టల్లో ప్రసవం ఘటనపై బాధ్యులను సస్పెండ్ చేయాలి
మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్‌లోని గురుకుల కళాశాలలో (Residential College) విద్యార్థిని ప్రసవ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే కేంద్రాలుగా కాకుండా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయని విమర్శించారు.
గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భంతో ఉన్న విషయం ఇన్ని రోజులుగా అక్కడి అధికారులకు ఎందుకు తెలియలేదని ప్రశ్నించారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోందన్నారు.గురుకుల విద్యార్థిని ప్రసవం, నవజాత శిశువు మృతి ఘటనపై, ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్, ఏ ఎన్ ఎం లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.