విమర్శలను సహించలేక ఫిర్యాదులా..?

26-11-2026 | 05:46pm

వెంకటాపూర్, నవంబర్ 26 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(Chief Minister Revanth Reddy) విమర్శించారనే కారణంతో బీఆర్ఎస్ యువజన నాయకుడు కోగీల మహేష్‌పై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ మునిగంటి నరేంద్ర చారి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి, మంత్రుల విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందన్నారు.

విమర్శలకు సమాధానం చెప్పకుండా ఫిర్యాదులు, కేసుల పేరుతో బెదిరించడం కాంగ్రెస్ నాయకుల అసహనానికి నిదర్శనమని విమర్శించారు. మంత్రి అండతో అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని చూడటం సరికాదన్నారు. కోగీల మహేష్‌ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి ఒత్తిళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు