రేపు సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

26-11-2026 | 05:52pm
  1. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలి 
  2. ఆలయ అర్చకులు చెరువుపల్లి విశ్వనాథ శర్మ 

పాపన్నపేట,నవంబర్26: మండల కేంద్రం పాపన్నపేటలోని సాయిబాబా ఆలయం(Sai Baba Temple) 17వ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించనున్నారని ఆలయ అర్చకులు చెరువుపల్లి విశ్వనాథ శర్మ పేర్కొన్నారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయన్నారు. 108 లీటర్ల ఆవు పాలతో సాయిబాబాకు ఘనంగా అభిషేకం, అనంతరం పట్టు వస్త్రాలతో బాబాను సుందరంగా అలంకరించనున్నారని తెలిపారు.

పాపన్నపేటలోని అన్నపూర్ణ హోటల్ యజమాని తమ్మాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల మహేష్ మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం సాయిబాబాను పల్లకిలో ఉంచి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తామని, ఆయా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబా కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.

మరిన్ని వార్తలు