ప్రజా పాలనలో పేదల సమగ్ర అభివృద్ధి
26-11-2026 | 05:48pm
కేసముద్రం: కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో(Government) పేదల హార్దిక అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని, నిలువ నీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Housing Scheme) గొప్పవరం అని కేసముద్రం మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం (వీ) లో గురువారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు మెరుగైన వసతి కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు కనుకుల సుభద్ర, బానోతు విజయ తదితరులు పాల్గొన్నారు.