ఏజెన్సీలో ఎస్సీలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలి

21-09-2026 | 03:32pm

జైనూర్, సెప్టెంబర్21 (విజయక్రాంతి) : స్వతంత్ర భారతదేశంలో(Independent India) ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను ఏజెన్సీ ప్రాంత దళితులకు కల్పించాలని ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి(Rights Struggle Committee) జేఏసీ జిల్లా అధ్యక్షుడు దౌనే ప్రకాష్ డిమాండ్ చేశారు.సోమవారం జైనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీల భూములకు వెంటనే పహాణీలు ఇప్పించి బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించాలన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నివసిస్తున్న ఎస్సీలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎస్సీల జనాభా పెరిగినందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కోరారు.ఈ సమావేశంలో మాన్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మావాడే దత్తా, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపెల్లి శంకర్, మండల ఉపాధ్యక్షుడు వాగ్మారె సంబాజీ, కోటంబె శ్రీహరి, వాగ్మారె సంగ్రామ్, దేవ్ కాంబ్లే సాయిబ్ రావ్, కోంబ్లె ప్రకాష్, గైక్వాడ్ మాధవ్, వాగ్మారె పరశురాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు