రాజంపేట గ్రామపంచాయతీలో డిప్యూటీ కమిషనర్ పర్యటన

27-11-2026 | 07:29pm

ఆసిఫాబాద్ ( విజయక్రాంతి): పంచాయతీరాజ్ కమిషనర్, సీఈవో దివ్య దేవరాజన్(Panchayat Raj Commissioner and CEO Divya Devarajan) ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ సుధాకర్ శుక్రవారం రాజంపేట గ్రామపంచాయతీలో(Rajampet Gram Panchayat) పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. జూబ్లీ మార్కెట్‌లోని(Jubilee Market) చికెన్, మటన్, చేపల మార్కెట్లు, ఇంకుడు గుంతలు, ప్రధాన రహదారి డివైడర్లు(Main road dividers), పారిశుధ్య నిర్వహణను తనిఖీ చేశారు. అలాగే ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్సా పోచయ్య, జెడ్‌పీసీఓ లక్ష్మీనారాయణ, డీపీఓ బిక్షపతి గౌడ్, డీఎల్‌పీఓ ఉమర్ హుస్సేన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ మౌనిక, వార్డు సభ్యుల జిల్లా అధ్యక్షుడు గులాం జావిద్, కొమరం వేణు, జబరి కిషోర్, తిరుసుల నానయ్య, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, బిల్ కలెక్టర్ నాగేందర్, ఎంపీడబ్ల్యూ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు