ఆదివాసీల హక్కులను గౌరవించాలి

30-10-2026 | 08:08pm

తుడుందెబ్బ నాయకులతో డీఎఫ్‌ఓ బాలమణి సమావేశం

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీల హక్కులను(Rights of tribals) గౌరవిస్తూ అటవీ సంరక్షణకు అందరూ సహకరించాలని జిల్లా అటవీ అధికారి బాలమణి(Forest Officer Balamani) కోరారు. శుక్రవారం జిల్లా అటవీ కార్యాలయంలో తుడుందెబ్బ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు 1/70, పెసా చట్టాలను గౌరవించాలని, ఆదివాసీ గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు కల్పించవద్దని కోరారు.

అటవీ శాఖ నియామకాలు, కాంట్రాక్టు పనుల్లో స్థానిక ఆదివాసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై డీఎఫ్‌ఓ బాలమణి స్పందిస్తూ ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలకు అవసరమైన కట్టెల వినియోగానికి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే అటవీ సంపదను వ్యాపార అవసరాలకు దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అటవీ సిబ్బంది వల్ల సమస్యలు ఎదురైతే నేరుగా తనకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, కనక ప్రభాకర్, పెందోర్ మారుతి, కొట్నక రాంశావ్, వెడ్మ భగవంత్ రావు, సిడాం నాగోరావు, పెంధోర్ ప్రకాష్, రాయ్ సిడాం జంగు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు