పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

30-10-2026 | 09:48pm

జిల్లా డీసీఓకు సర్పంచుల ఫోరం వినతి..

సిద్దిపేట రూరల్, అక్టోబర్ 30: మండలంలోని అన్ని గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Grain purchasing centers) వెంటనే ప్రారంభించాలని కోరుతూ జిల్లా డీసీఓ అధికారికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు. రైతులు ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మమత రాజు, తోర్నాల సర్పంచ్ పద్మదేవి గోపినాథ్‌రెడ్డి, మండల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు