సాగునీటి కోసం పంట పొలాల వద్ద బస చేసిన రైతులు
బెజ్జూర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : సాగునీరు(Irrigation water) అందక రైతులు పంట పొలాల(crop fields) వద్దే రాత్రి, పగలు బస చేయాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని బెజ్జూర్, పాపన్నపేట్(Bejjur, Papannapet), తలాయి తదితర గ్రామాల రైతులు వరి పంటకు నీరు పెట్టేందుకు రాత్రి వేళ కాలువ వద్ద కాపలా కాస్తున్నారు. రాత్రి సమయంలో వచ్చే నీటిని పొలాలకు మళ్లించుకునేందుకు చలిలో చలిమంట వేసుకుని, పొలం గట్టుపైనే పడుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా కాలువకు సక్రమంగా నీరు రాకపోవడం, వచ్చిన నీటిని ఎగువ రైతులు(Farmers) అడ్డుకోవడంతో దిగువ రైతులకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు,కుంటలలో ఎల్ నివో ప్రభావంతో(impact of El Nino) ఎండిపోతున్నాయి. పంటలకు సాగునీరు అందుదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి పంట ఎండిపోయే దశలో ఉండడంతో తప్పని పరిస్థితుల్లో రాత్రి వేళ పొలం వద్దే బస చేస్తున్నామని రైతులు తెలిపారు.ఇరిగేషన్ అధికారులు స్పందించి అందరికీ సమానంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.