గిరిజన సంక్షేమంపై కోవా లక్ష్మి కీలక ప్రతిపాదనలు

26-09-2026 | 09:26pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ కమిటీ(Tribal Welfare Committee) హైదరాబాదులో శనివారం జరిగిన తొలి సమావేశంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా  విద్య, మౌలిక వసతులు, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై పలు ప్రతిపాదనలు చేశారు. ఇటీవల ఆశ్రమ పాఠశాలలను(Ashram schools) సందర్శించిన నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు రాబోయే చలికాలంలో విద్యార్థులకు(Students') వేడినీటి సదుపాయం కోసం గీజర్లు ఏర్పాటు చేయాలని కోరారు.

జిల్లాలో పనిచేస్తున్న సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన స్కేలు అమలు చేయాలని, అనివార్య కారణాలతో మృతిచెందిన సీఆర్టీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని సూచించారు. ఇంజినీరింగ్‌ శాఖలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, కల్వర్టుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.

ఎస్టీ నియోజకవర్గాల్లో జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు జరగాలని, గిరిజన జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాదిగూడ, నార్నూర్ మండలాల్లో గిరివికాసం కింద మంజూరైన బోర్‌వెల్లకు మోటార్లు బిగించాలని, లింగాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు అటవీ అనుమతులు త్వరగా మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు